Tuesday 19 November 2013

చట్ట'భద్రత' లేని సిబిఐ..!

CBI at UPA www.10tv.in
కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)చట్టబద్ధతపై గౌహతి హై-కోర్టు ఇచ్చిన తీర్పుతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు సిబిఐ ఆత్మరక్షణలో పడాల్సివచ్చింది. అసలు సిబిఐ రాజ్యాంగ బద్ధ దర్యాప్తు సంస్థే కాదని, సిబిఐ ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. దీనిపై హుటాహుటిన కేంద్రం సుప్రీంను ఆశ్రయించడంతో.. అత్యున్నత ధర్మాసనం 'గౌహతి' తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6 కు వాయిదావేసింది.    ఈ విషయంలో కేంద్ర హోంశాఖకు సుప్రీం నోటీసులు జారీచేసింది. పక్షంలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. దీంతో తదుపరి చర్యలపై కేంద్ర సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. సిబిఐకి చట్టబద్ధత సాధించే ప్రయత్నాలను ముమ్మరం చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని చిక్కులు ఎదుర్కొనే పరిస్థితులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. సిబిఐకి చట్టబద్ధత హోదా కల్పించకపోతే దాని దర్యాప్తు పరిధి ప్రశ్నార్థకంగా మారే.. See More...

No comments:

Post a Comment