Friday 8 November 2013

371డీ (లా)..!

Article 371D 10tv.in
బోడి గుండుకు మోకాలికి ముడివేద్దామని అవకాశ వాద రాజకీయ దురంధులు, గోడమీద వాటాన్ని పిల్లికన్నా మిన్నగా ప్రయోగించే కురువృద్ధ నేతలు శతవిధాలా ప్రయత్నించారు.. ఇందుకోసం అష్టకష్టాలూ పడ్డారు.. ఆపసోపాలు పడ్డారు.. కానీ.. బోడి గుండు, మోకాలు నున్నగా ఉన్నంత మాత్రాన ఒక్కటవుతాయా..?! కావని అందరికీ తెలుసు. అయినప్పటికీ.. అవి రెండూ ఒక్కటే అని చెప్పేందుకు, తద్వారా పిచ్చి జనాన్ని (వాళ్ల దృష్టిలో) మరోసారి మోసం చేసేందుకు తాపత్రయ పడ్డారు. కానీ.. అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు కదా..!? చివరకు దొరికిపోయారు! పైన చెప్పిన కథలో ఆర్టికల్ -3 బోడి గుండు అయితే.. మోకాలు ఆర్టికల్ 371-డి. ఈ రెంటికీ ముడి వేయాలని ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోయిన వారు కాంగ్రెస్టిడిపివైసిపి నేతలు.  'తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం' అని జులై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న దగ్గర్నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రంగస్థలంపై మొదలైన రాజకీయ నాటకాన్ని రక్తి కట్టించేందుకు ఇరు ప్రాంతాల్లోని కాంగ్రెస్, టిడిపి, వైసిపి నేతలు చేయని ప్రయత్నం లేదు. పడని పాట్లు లేవు. ఇందులో ఏ పార్టీకీ మినహాయింపు లేదు. అన్ని ఆ తానులో ముక్కలే.. ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మినహా! భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామన్న ఆ పార్టీ.. విభజన వాదన మొదలైన రోజు ఏ మాటైతే చెప్పిందో, నేటికీ దానికే కట్టుబడి ఉంది. మిగిలిన పార్టీలు మాత్రం.. భవిష్యత్ లో తమకు కలిగే లాభ, నష్టాలను బేరీజు వేసుకుని అలవోకగా నిర్ణయాలు మార్చేసుకున్నాయి. ఇప్పటికీ అదే పనిలో ఉన్నాయి. ప్రాంతానికో తీరుగా మాట్లాడుతూ ఊసరవెల్లులు తమ ముందు దిగదుడుపేనని చెప్పకనే చెప్పాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్, టిడిపి నేతలు వ్యవహరించిన, ఇప్పటికీ వ్యవహరిస్తున్న తీరు అత్యంత నీచ రాజకీయాలకు పరాకాష్ట. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని ఈ రెండు పార్టీల నేతలే డిమాండ్ చేస్తారు.. రాష్ట్ర విభజన ప్రజావ్యతిరేక నిర్ణయమని ఖండించేది కూడా మళ్లీ ఈ పార్టీల నాయకులే. ఈ విధంగా అస్పష్ట ప్రకటనలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టి, పబ్బం గడుపుకో చూస్తున్న తీరు అత్యంత హేయం, జుగుప్సాకరం. విధాన ప్రాతిపదికన తమ పార్టీలు నడవట్లేదని, అవకాశవాద ప్రాతిపదికన, స్వార్థ ప్రయోజనాల ప్రాతిపదికన నడుస్తున్నాయని మహా ఘనంగా చాటిచెప్పారీ పార్టీల ఘన నాయకులు...see more..........







No comments:

Post a Comment