Friday 8 November 2013

సినీ నటుడు ఏవీఎస్ ఇకలేరు..

AVS Passes Away
Avs passes away 10tv.in


హైదరాబాద్: ప్రముఖ సినీ హాస్య నటుడు ఏవీఎస్ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబధిత వ్యాధితో భాధపడుతున్న ఆయనను పదిరోజుల క్రితం గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే కాలేయానికి ఇన్ ఫెక్షన్ సోకడంతో చికిత్స చేయలేమని, పరిస్ధితి చేయి దాటిపోయిందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు శుక్రవారం ఆయనను వెంటిలేషన్ పైనే ఇంటికి తీసుకెళ్లారు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆయన తన కుమారుని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎవీఎస్ కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దాదాపు 500 సినిమాల్లో నటించిన ఆయన పలు పాత్రలలో ప్రేక్షకులను అలరింపజేశారు.see more....

No comments:

Post a Comment