Sunday 10 November 2013

కాంగ్రెస్ కు 'కామన్వెల్త్' కష్టాలు...

Commonwealth Meeting  in Colombo 10tv.in
తమిళ వాసుల ఒత్తిడి ఫలించింది. శ్రీలంకలో నవంబర్ 15 న జరగనున్న కామమన్వెల్త్ సదస్సుకు ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకావడంలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన తరపున కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ పర్యటనకు వెళ్లనుందని పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వానికి సమాచారమందించింది. అయితే అయిష్టంగానే ప్రధాని తన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశీయంగా విస్తృత రాజకీయ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని కామన్వెల్త్ సమావేశాలకు ప్రధానమంత్రిని కాంగ్రెస్ దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. పర్యటన రద్దు నేపథ్యమిది.. శ్రీలంకలో తమిళుల ఊచకోత, తరచూ జాలర్ల నిర్భందం వంటి చర్యల నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీలంక పర్యటనను బహిష్కరించాలని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్ధలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై తమిళనాడు అసెంబ్లీ సైతం ఏకగ్రీవ తీర్మానం చేసింది. కొలంబోలో కామన్వెల్త్ శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి చాలా దేశాలు అభ్యంతరాలు తెలుపుతున్నాయనీ, నిజానికి ఆ దేశాల కన్నా మన దేశమే ఎక్కువగా ఈ విషయంలో స్పందించాలని ఆ తీర్మానంలో పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన తమిళ మంత్రులే ప్రధాని పర్యటనను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తమిళనాడుకు చెందిన పలు సంస్ధలు ఈ నెల 12 న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఇంతటి తీవ్ర నిరసనల నేపథ్యంలో...............see more

No comments:

Post a Comment