Saturday 9 November 2013

న్యాయమా నువ్వెక్కడ..?

jcrop-preview
careless police 10tv.in

హైదరాబాద్ : మహిళలపై అఘాయిత్యాలకు అంతేలేకుండాపోతోంది. ఆకృత్యాలు జరిగినా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేవారి సంఖ్య తక్కువ.  ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా ఎఫ్ ఐ ఆర్ కు నోచుకోని కేసులెన్నో. ఎఫ్ ఐఆర్ ఫైల్ కాకముందే దళారుల భేరసారాలతో కనుమరుగౌతున్న కేసులెన్నెన్నో.  ఒక వేళ న్యాయం కోసం కోర్టు వరకు వెళ్లినా ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా శిక్ష పడిన ధాఖలాలు కనబడవు.  అత్యాచార కేసుల్లో ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క నిందితుడికి శిక్ష పడకపోవడం మహిళలపై ఆకృత్యాలు పెరగడానికి కారణమవుతున్నాయి.  ఢిల్లీ గ్యాంగ్ రేప్, రాష్ట్ర రాజధానిలో ఘటనలకు నిర్భయఅభయ అని పేరుపెట్టుకున్నా మహిళలకు అడుగడుగునా భయపెట్టే అకృత్యాలే వరుసగా జరుగుతున్నాయి. ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసి పడినా మహిళలపై జరిగే నేరాలలో మార్పు రావడం లేదు. దేశంలో ఏటేటా అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. చట్టాల్లో లోపాలు నిందితులకు అనుకూలంగా మారుతున్నాయి. దీంతో మానవమృగాలు రెచ్చిపోతున్నాయి. పాలకుల గంభీర స్వరాలు సైతం పనికిమాలినవిగా తయారైపోయాయి. మహిళలపై వారికున్న చిత్తశుద్ది అఘాయిత్యాలను రూపుమాపలేకపోతున్నాయి. మహిళలపై నేరాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దీంతో చట్టాలు మహిళలకు శాపంగా మారిపోయాయి. ఇటీవలి కాలంలో మహిళలపై నేరాలు, ఆకృత్యాలు గణనీయంగా పెరుగుతున్నాయి.......see more at 

No comments:

Post a Comment