Friday 15 November 2013

సచిన్.. అభిమానుల గుండెల్లో నాటౌట్

jcrop-preview
Sachin Tendulkar Last Match Starts www.10tv.in
సచిన్.. బ్రాడ్ మన్ అని ఒకరన్నారు.. రిచర్డ్స్ అని ఇంకొకన్నారు.. సోబర్స్ అని వేరొకరన్నారు.. అసలు సచిన్ ఎవరు..? సచిన్.... టెండూల్కర్ మాత్రమే.   తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికే దిశగా నవంబర్ 14 నుంచి చివరి మ్యాచ్ ఆడుతున్నాడు సచిన్. సొంత మైదానమైన ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను సచిన్ కుటుంబ సభ్యులు, ప్రముఖులు, అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. కోట్ల మంది అభిమానులు టీవీల్లో చూడనున్నారు. గత కొద్ది రోజులుగా దేశమంతా సచిన్ మేనియా చోటు చేసుకుంది. సచిన్ చివరి మ్యాచ్ పేర వ్యాపార వర్గాలు తమ బిజినెస్ ను పెంచుకునే ప్రయత్నాలు చేశాయి. సచిన్ మేనియా విదేశాలకూ పాకింది. అంతర్జాతీయ మీడియా సైతం సచిన్ ను ఆకాశానికి ఎత్తేస్తోంది. సచిన్ కెరీర్ ఆఖరి రోజుల్లో ప్రతి రోజూ ప్రత్యేక కథనాలు ఇస్తోంది.  దాదాపు ఇరవై ఒక్క ఏళ్ల పాటు సచిన్ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచాడు. ఏ ఆటగాడైనా.. కొన్ని మ్యాచుల్లో రాణించాకే అభిమాన గణాన్ని పొందుతాడు. కానీ.. సచిన్ విషయం దీనికి భిన్నంగా జరిగింది. ఆడిన తొలి మ్యాచ్ నుంచే అభిమానులను సంపాదించాడు. తాను ఆడే మ్యాచ్ ల సంఖ్య పెరిగిన కొద్దీ.. అభిమానుల సంఖ్యనూ అంతకన్నా వంద రెట్లు పెంచుకుంటూ పోయాడు సచిన్. సాధారణంగా ఒక ఆటగాడి కెరీర్ 10 నుంచి 14 ఏళ్లు సాగితే.. అందులో ఐదారేళ్లు మాత్రమే అభిమానులను తన చుట్టూ తిప్పుకోగలడు. కానీ.. సచిన్ విషయంలో అలా జరగలేదు. కెరీర్ ఆరంభం నుంచి ఆఖరి వరకూ అదే క్రేజ్ ఉంది. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ భారత్ కు విజయాన్నందించాలని తపన పడిన మాస్టర్.. అందుకోసం నిర్విరామ కృషి చేశాడు. ఆటలోని మెలికల్ని నేర్చుకోవడమే కాకుండా.. ఆటకే మెలకువలు నేర్పిన ఘనత మాస్టర్ ది. అప్పర్ కట్.. See More...

No comments:

Post a Comment