Saturday 16 November 2013

ధీరుడా... వందనం..

Legend Sachin Tendulkar  10tv.in
 
పరుగుల యంత్రం ఆగింది... ప్రత్యర్థులకు ఉపశమనం కలిగింది.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ముగిసింది. ముంబయిలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలిచిన అనంతరం.. 200 టెస్టులు ఆడిన సచిన్ అభిమానుల భారమైన హృదయాల మధ్య ఘనంగా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు... రిటైర్మెంట్ పై నిర్ణయాన్ని టెండూల్కర్ ముందే ప్రకటించినప్పటికీ, చివరి మ్యాచ్ సందర్భంగా అభిమానులు, మాజీ ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. సచిన్ కెరీర్ లోని మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ... బాధాతప్త హృదయాలతో ధీరుడికి వీడ్కోలు పలికారు అభిమానులు... పోరాట పటిమే నిలబెట్టింది...    సచిన్ టెండూల్కర్... 1989 నవంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. పిన్న వయసులో మైదానంలో అడుగిడుతున్న సచిన్ పై క్రికెట్ ప్రపంచం అంతా కన్నేసింది. అంత వత్తిడిలోనూ పాకిస్తాన్ తో ఆడిన రెండో టెస్టులోనే 88 పరుగులు చేసి భవిష్యత్తుకు బాట వేశాడు... ఇక ఎక్కడా వెనుతిరగకుండా... 24 ఏళ్ల పాటు క్రికెట్ అంటే సచిన్... సచిన్ అంటే క్రికెట్ అనే విధంగా ఆటను మార్చేశాడు. మొదటి మ్యాచ్ నుండి చివరి మ్యాచ్ వరకూ అదే పోరాట పటిమను.......see more

No comments:

Post a Comment