Monday 18 November 2013

ఓట్లు.. సీట్లు.. పాట్లు..

Rahul vs Modi 10tv.in

''కేంద్రం నుంచి నిధులిచ్చామంటున్నావ్.. నీ మామ సొమ్ము ఇచ్చావా..?'' రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మోడీ విమర్శ. ''గుజరాత్ ను అభివృద్ధి చేశానంటున్నావ్.. ఆ డబ్బు నీ తాతదా..?'' కాంగ్రెస్ సీనియర్ నేత జగదాంబికా పాల్ ప్రతివిమర్శ. ''బీజేపీ వాళ్లంతా దొంగలే..'' కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యలు.. ''మేము దొంగలం కాదు.. దేశ ఖజానాకు కాపలాదారులం'' బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రతిస్పందన     ప్రస్తుతం ''ఆ.. ఐదు రాష్ట్రాల్లో'' ఇలాంటి వ్యాఖ్యానాలే వినిపిస్తున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సభలుసమావేశాలతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం తీవ్రస్థాయిలో వేడెక్కింది. జోరుగా సాగుతున్న ప్రచారం...    అక్టోబర్ 4న కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించడంతో.. ఛత్తీస్ గఢ్మధ్యప్రదేశ్రాజస్థాన్మిజోరాంఢిల్లీ రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల కోలాహలం.. ప్రస్తుతం ఉచ్ఛ స్థితికి చేరుకుంది. ఇప్పటికే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో తొలి దశ ఓటింగ్ పూర్తయింది. ఓటరు దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అయితే.. ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులు ఎలా ఉన్నా.. ప్రధాన పోరాటం మాత్రం కాంగ్రెస్, బిజెపి మధ్యనే సాగుతోంది. 2014లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు....See more

No comments:

Post a Comment